సౌతాంప్టన్: భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే తొలిసారి టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నది. బుధవారం ఇరు జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా తొలి వన్డే పోరు జరుగనుంది.
స్వదేశం వేదికగా జరిగే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌పై సిరీస్ గెలువాలన్న పట్టుదలతో హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా కనిపిస్తున్నది. ఇటీవల శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లను దక్కించుకున్న భారత్ అదే జోష్‌తో ఇంగ్లిష్ టీమ్‌ను ఓడించాలని కసితో ఉన్నది.