న్యూఢిల్లీ: దేశవాళీల్లో రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్.. ఈ సీజన్ నుంచి గుజరాత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. తాజా సీజన్ ప్రారంభానికి ముందు బిష్ణోయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గుజరాత్ జెర్సీ ధరించిన ఫొటోను పోస్ట్ చేశాడు. దీనికి ‘నూతన ఆరంభం’ అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. టీమ్ఇండియా తరఫున 10 టీ20లు, ఒక వన్డే ఆడిన బిష్ణోయ్.. ఇప్పటి వరకు 16 వికెట్లు పడగొట్టాడు.