న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ ఉన్నతి హుడా ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. తుదిపోరుకు చేరిన తొలి భారత సింగిల్స్ ప్లేయర్‌గా చరిత్రకెక్కిన ఉన్నతి ఆదివారం జరిగిన అండర్-17 బాలికల ఫైనల్లో 18-21, 21-9, 14-21తో సరున్రాక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ అండర్-15 ఫైనల్లో అనీశ్ 8-21, 24-22, 19-21తో చాంగ్ యేహ్ చేతిలో ఓడాడు. బాలుర అండర్-17 డబుల్స్ ఫైనల్లో అర్ష్ మహమ్మద్-సంస్కార్ సరస్వత్ జోడీ 13-21, 21-19, 22-24తో చైనీస్ తైపీ జంట చేతిలో ఓడింది.