ఒర్లిన్స్: భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్.. ఒర్లిన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో గురువారం ప్రియాన్షు 21-8, 21-16తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై విజయం సాధించాడు. గత వారం స్పెయిన్ మాస్టర్స్ టైటిల్ చేజిక్కించుకున్న టాప్ సీడ్ నిషిమోటోను ప్రపంచ 58వ ర్యాంకర్ ప్రియాన్షు వరుస గేమ్‌ల్లో మట్టికరిపించడం విశేషం. మహిళల సింగిల్స్‌లో తాన్య, పురుషుల సింగిల్స్‌లో మిథున్ ఓడిపోయారు.