న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో13వ ర్యాంక్ కు చేరుకున్నాడు. ఇటీవలి ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో సెమీస్ చేరి ఆకట్టు కున్న లక్ష్యసేన్ ఐదు ర్యాంక్‌లు మెరుగుప ర్చుకున్నాడు. ఏప్రిల్ నెలఖారు వరకు టాప్-16లో ఉన్న ప్లేయర్లు రానున్న పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తారు.
ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రాణించడం ద్వారా సేన్ మెరుగైన ర్యాంకింగ్ అందుకున్నాడు. మరోవైపు హెచ్ఎస్ ప్రణయ్ (9), శ్రీకాంత్ (27), ప్రియాంశు రజావత్ (32) ర్యాంక్‌ల్లో ఉన్నారు. మహిళల విభాగంలో పీవీ సింధు 11వ ర్యాంక్‌లో ఉండగా, డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ శెట్టి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నది.