ISSF | లిమా (పెరూ): ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత యువ షూటర్లు పతకాల మోత మోగిస్తున్నారు. ఇదివరకే ఈ టోర్నీలో రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం గెలిచిన భారత్.. సోమవారం మరో రెండు కాంస్య పతకాలు గెలిచింది.
పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గౌతమి భానోత్, అజయ్ మాలిక్ మూడో స్థానంలో నిలిచారు.