Sonam Maskar | కైరో: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత యువ షూటర్ సోనమ్ మస్కర్ రజత పతకం సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో తొలిసారి బరిలోకి దిగిన సోనమ్ రెండో స్థానంలో నిలిచింది. సోమవారం జరిగిన పోటీల్లో సోనమ్ 252.1 పాయింట్లతో వెండి పతకం కైవసం చేసుకుంది.
అన్నా జాన్సెన్ (జర్మనీ), అనెటా స్టాంకోవిచ్ (పోలాండ్) వరుసగా స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు. మరోవైపు మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్కు చెందిన సిమ్రన్ప్రీత్ కౌర్ బ్రార్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. రీథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు.