Vishnu Saravanan | న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌కు భారత యువ సెయిలర్ విష్ణు శరవణన్ బెర్తు దక్కించుకున్నాడు. బుధవారం జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఐఎల్సీఏ-7 అర్హత టోర్నీలో విష్ణు 26వ స్థానంలో నిలిచాడు. దీంతో ఆసియా దేశాల తరఫున అత్యుత్తమ ర్యాంక్ దక్కించుకోవడంతో పారిస్ విశ్వక్రీడలకు బెర్తు ఖరారు చేసుకున్నాడు. ఈ టోర్నీలో మొత్తం 152 మంది పోటీపడగా, విష్ణు 174 పాయింట్లతో పోటీని ముగించాడు. తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత సెయిలర్‌గా విష్ణు నిలిచాడు.