టోక్యో: ఒలింపిక్స్ ( Tokyo Olympics )65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఇండియన్ స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా ఓడిపోయాడు. శుక్రవారం అజర్బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్‌తో జరిగిన సెమీస్ బౌట్లో అతడు 5-12 తేడాతో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన రెండు బౌట్లలోనూ గెలిచి గోల్డ్‌పై ఆశలు రేపిన భజరంగ్.. ఇప్పుడు బ్రాంజ్ మెడల్ కోసం శనివారం తలపడనున్నాడు. రియో గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన ప్రత్యర్థి హజి ముందు భజరంగ్ నిలవలేకపోయాడు.
తొలి పీరియడ్‌లోనే 4-1 లీడ్‌లోకి దూసుకెళ్లిన అలియెవ్.. రెండో పీరియడ్‌లో మరింత చెలరేగిపోయాడు. ఈ పీరియడ్‌లో భజరంగ్ 4 పాయింట్లు సాధించి పుంజుకోవాలని చూసినా.. అలియెవ్ ఏకంగా 8 పాయింట్లతో సులువుగా గెలిచాడు. ఈ ఓటమితో శనివారం రష్యన్ ఒలింపిక్ కమిటీకి చెందిన రషిదోవ్‌తో బ్రాంజ్ మెడల్ కోసం భజరంగ్ తలపడనున్నాడు.