World Archery Championships 2023 | భారత ఆర్చరీలో నయా చరిత్ర.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఎట్టకేలకు స్వర్ణం
World Archery Championships 2023 | భారత ఆర్చరీ చరిత్రలో నూతన అధ్యాయం! నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకం ఎట్టకేలకు మనవాళ్ల చేతికి చిక్కింది. ఒకటికి నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమైన తెలుగమ్మాయి జ్యోతి సురేఖ ఐదో ప్రయత్నంలో పసిడి పతకం పట్టేసింది.
World Archery Championships 2023 | భారత ఆర్చరీ చరిత్రలో నూతన అధ్యాయం! నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకం ఎట్టకేలకు మనవాళ్ల చేతికి చిక్కింది. ఒకటికి నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమైన తెలుగమ్మాయి జ్యోతి సురేఖ ఐదో ప్రయత్నంలో పసిడి పతకం పట్టేసింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి బృందం బంగారు పతకంతో మెరవడంతో మెగాటోర్నీలో భారత్ పతకాల ఖాతా తెరిచింది.
బెర్లిన్: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్‌తో కూడిన భారత కాంపౌండ్ టీమ్.. పసిడి పతకంతో మెరిసింది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం (పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి) కావడం విశేషం. శుక్రవారం జరిగిన టీమ్ ఫైనల్లో భారత్ 235-229తో మెక్సికోపై విజయం సాధించింది. జ్యోతి సురేఖ తన గురితో అదుర్స్ అనిపించుకోవడంతో ఈ మెగాటోర్నీలో భారత పతకాల బోణీ కొట్టింది. తొలి మూడు రౌండ్లలో మన ఆర్చర్లు సత్తాచాటడంతో 60 పాయింట్లకు గానూ భారత్ 59 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. దీంతో మన అమ్మాయిలు 177-172తో ఆధిక్యం దక్కించుకున్నారు. ఇక చివరి వరకు అదే జోరు కనబర్చడంతో చరిత్రలో నయాశకాన్ని లిఖించారు. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ 220-216తో కొలంబియాపై, క్వార్టర్ ఫైనల్లో 228-226తో చైనీస్ తైపీపై విజయాలు సాధించింది.
ఐదోసారి ఎట్టకేలకు..
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగుసార్లు ఫైనల్లో ఓడి వెండి పతకాలతో సరిపెట్టుకున్న జ్యోతి సురేఖ.. ఐదోసారి పసిడి వెలుగులు విరజిమ్మింది. 2021లో చివరిసారి అమెరికా వేదికగా జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో జ్యోతి వరుస విజయాలతో విజృంభించింది. వ్యక్తిగత విభాగంతో పాటు, మహిళల టీమ్ ఈవెంట్లో, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఫైనల్స్‌కు చేరింది. అయితే మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలే ఎదురవడంతో రజత పతకాలతో సరిపెట్టుకుంది. ఈ సారి అందుకు భిన్నంగా ఆరంభంలోనే ప్రత్యర్థిపై ఆధిక్యం దక్కించుకున్న జ్యోతి సురేఖ గురి తప్పకుండా బాణాలు సంధించడంతో.. ఇన్నాళ్లకు పసిడి కల నెరవేరింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా జ్యోతికి ఇది ఏడో పతకం (1 స్వర్ణం, 4 రజతాలు, 2 కాంస్యాలు). 1981 నుంచి ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటూ వస్తున్న భారత్‌కు 42 ఏండ్ల తర్వాత తొలి స్వర్ణం దక్కడం గమనార్హం.
గతంలో ఎన్నోసార్లు రజత పతకాలు సాధించాం. అందుకే ఈసారి పతకం రంగు మార్చాలని ముందే అనుకున్నాం. టీమ్ మీటింగ్‌లోనూ దీనిపైనే చర్చ జరిగింది. ఫలితంతో సంతోషంగా ఉన్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే మున్ముందు మరిన్ని పతకాలు గెలుస్తాం.
-జ్యోతి సురేఖ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

