చెన్నై: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ అధికారికంగా బెర్తు దక్కించుకున్నాడు. తాజాగా ముగిసిన హెలీబ్రోన్ చాలెంజ్ టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా ర్యాంకింగ్స్‌లో టాప్-80లోకి దూసుకురావడం కలిసి వచ్చింది.
విశ్వక్రీడలకు అర్హత సాధించడంపై నాగల్ ఎక్స్ ద్వారా శనివారం అభిమానులతో పంచుకున్నాడు. ‘పారిస్ ఒలింపిక్స్‌కు అధికారికంగా బెర్తు సాధించడం చాలా సంతోషంగా ఉంది. నా హృదయంలో ఒలింపిక్స్‌కు ఎప్పుడు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. టోక్యో తర్వాత పారిస్ ఆడాలన్న లక్ష్యంతో ముందుకు సాగడం కలిసి వచ్చింది’ అని అన్నాడు.