BCCI | ఢిల్లీ: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోయే భారత జట్టుకు చెందిన క్రికెటర్లు భార్య, పిల్లలు లేకుండా దుబాయ్‌కు సోలోగానే పయనమవనున్నారు. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం కనీసం 45 రోజుల విదేశీ పర్యటన అయితే రెండు వారాల పాటు కుటుంబాలను అనుమతించనున్నారు.
చాంపియన్స్ ట్రోఫీ జరిగేది (ఫిబ్రవరి 19 నుంచి మార్చి 09 దాకా) మూడువారాలు మాత్రమే కావున ఈ పర్యటనకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను బీసీసీఐ అనుమతించడం లేదు. అంతేగాక ఆటగాళ్ల వ్యక్తిగత సిబ్బంది (మేనేజర్లు, ఏజెంట్స్, చెఫ్‌లు).. క్రికెటర్లకు కేటాయించిన హోటల్స్‌లో కాకుండా వేరే హోటల్లో ఉండనున్నారు. భారత జట్టు ఈనెల 15న దుబాయ్‌కు బయల్దేరి వెళ్లనుంది.