బిష్కెక్(కజకస్థాన్) : అండర్-17 మహిళల ఆసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను భారత జట్టు గెలుచుకున్నది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత యువ మహిళా రెజ్లర్లు మొత్తంగా 7 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలతో అగ్రస్థానంలో నిలిచారు.
తొలి రెండు రోజుల్లో పది పతకాలు సాధించిన మన రెజ్లరు సోమవారం చివరి రోజున ఏడు పతకాలు సాధించారు. పురుషుల 43 కిలోల విభాగంలో ప్రవీణ్, మహిళల 57 కిలోల విభాగంలో నేహా, మహిళల 73 కిలోల విభాగంలో కాజల్, 65 కిలోల విభాగంలో శిక్ష స్వర్ణాలు సాధించగా,సౌరభ్‌కు రజతం, నరేందర్‌కు కాంస్యం దక్కాయి.