న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా లగేజ్ ఎట్టకేలకు దొరికింది. బుధవారం స్పోర్ట్స్ కిట్ తన వద్దకు చేరినట్లు స్టార్ ప్యాడ్లర్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంలో తనకు సాయంగా నిలిచిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మనిక ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలా ఉంటే పెరూలో టోర్నీ ముగించుకుని స్వదేశానికి వచ్చిన బాత్రా తన లగేజ్ పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. .