Malaysia Open | తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన సైనా, కిదాంబి శ్రీకాంత్
హన్ యుయీ చేతిలో 12-21, 21-17, 12-21తో సైనా పరాజయం
Malaysia Open : కొత్త ఏడాదిలో తొలి టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించాలి అనుకున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు షాక్ తగిలింది. మలేషియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఆమె పోరాటం ముగిసింది. మాజీ వరల్డ్ నంబర్ 1 సైనా, చైనాకు చెందిన పదకొండో ర్యాంకర్ హన్ యుయీ చేతిలో ఓడిపోయింది. మూడు సెట్లలో 12-21, 21-17, 12-21తో సైనా పరాజయం పాలైంది. పురుషల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ కూడా ఇంటిదారి పట్టాడు. 13వ ర్యాంకర్ అయిన ఇతను తనకంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న జపాన్ ఆటగాడు కెంటా నిషిమొటో చేతిలో ఓటమి చవిచూశాడు. 17 ర్యాంక్‌లో ఉన్న నిషిమొటో వరుస సెట్లలో 21-19, 21-14తో శ్రీకాంత్‌పై గెలుపొందాడు.
రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయిన సైనా, హన్ యుయూతో పోరాడి ఓడిపోయింది. తొలి సెట్ కోల్పోయిని సైనా రెండో సెట్లో పుంజుకుంది. అయితే.. నిర్ణయాత్మకమైన మూడో సెట్లో వెనకబడింది. పురుషుల విభాగంలో కెంటా నిషిమొటో 42 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంతో ఒక్క సెట్ కూడా గెలవలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

