టోక్యో: భారత స్టార్ షట్లర్పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, చైనా క్రీడాకారిణి చెన్ యూఫీ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవడంతో ఆమెకు ఫైనల్ బెర్త్ దక్కింది.
మ్యాచ్ నిలిచిపోయే సమయానికి సింధు 21-19, 15-10తో ఆధిక్యంలో ఉంది. రెండో గేమ్‌లో చైనా ప్లేయర్ కాలి కండరాల గాయంతో బాధపడుతూ కోర్టును వీడాల్సి వచ్చింది. ఆదివారం జరిగే తుదిపోరులో జపాన్ స్టార్ షట్లర్ అకానె యమగూచితో సింధు తలపడనుంది.