న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతున్నది. అజర్బైజాన్ వేదికగా జరుగుతున్న టోర్నీ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ మిక్స్ టీమ్ ఈవెంట్లో భారత జోడి స్వర్ణం కొల్లగొట్టింది. శనివారం జరిగిన ఫైనల్లో స్వప్నిల్-అషి చైక్సీ జంట16-12తో ఉక్రెయిన్ ద్వయాన్ని చిత్తు చేసి భారత్ ఖాతాలో రెండో పసిడి పతాకన్ని చేర్చింది.
అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత మహిళల త్రయం ఎలవెనిల్ వలరివన్, శ్రేయ అగర్వాల్, రమిత స్వర్ణం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో స్వప్నిల్‌కు ఇదే తొలి బంగారు పతకం కాగా.. ఓవరాల్‌గా మెగాటోర్నీలో అత డు మూడు మెడల్స్ ఖాతాలో వేసుకున్నాడు.