ISSF | లిమా (పెరూ): ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) ఆధ్వర్యంలో లిమా వేదికగా జరుగుతున్న జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. పురుషులు, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో ఉమేశ్, ప్రధ్యుమ్న్ సింగ్, ముకేశ్‌తో కూడిన భారత త్రయం.. 1,726 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని ముద్దాడింది.
ఇటలీకి రజతం దక్కగా రొమానియా కాంస్యం సాధించింది. మహిళల కేటగిరీలో కనిష్క, లక్షిత, అంజలి.. 1,708 పాయింట్లతో బంగారు పతకాన్ని నెగ్గారు. అజర్బైజాన్, ఉక్రెయిన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మహిళల వ్యక్తిగత ఈవెంట్లో కనిష్క కాంస్యం సాధించింది. ఇక పురుషుల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ చేరిన ఉమేశ్, ప్రధ్యుమ్న్.. 6, 8 స్థానాల్లో నిలిచారు.