Vaun Tomar : భారత స్టార్ షూటర్ వరుణ్ తోమర్(Vaun Tomar) ప్రతిష్ఠాత్మక ప్యారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) బెర్తు దక్కించుకున్నాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్(Asian Olympic Qualifiers)లో పసిడి పతకంతో మెరిసిన అతడు విశ్వక్రీడలకు అర్హత సాధించాడు.
అర్జున్ సింగ్ చీమా, ఉజ్వల్ మాలిక్‌లతో కలిసి తోమర్ టీమ్ విభాగంలో దేశానికి బంగారు పతకం అందించాడు. అంతేకాదు వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌కు అర్హత సాధించాడు. తద్వారా ఈ స్టార్ షూటర్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అతడు విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. దాంతో భారత్ నుంచి ప్యారిస్ బెర్తు సొంతం చేసుకున్న 14వ షూటర్‌గా తోమర్ గుర్తింపు సాధించాడు.
India’s #VarunTomar has won gold
🥇 & India’s 14th @Paris2024 quota place, winning the 10m Air Pistol Men at the #AsianOlympicQualification event in Jakarta. The 20-year old shot 239.6 in the final, leading an Indian 1-2 as Arjun Cheema came second. Brilliant!#IndianShooting pic.twitter.com/uIJ6M3jrIH— NRAI (@OfficialNRAI) January 8, 2024
ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్న భారత షూటర్లు : సరబ్జోత్ సింగ్, రాజేశ్వరి కుమారి, సిఫ్త్ కౌర్ సమ్రా, మెహులీ ఘోష్, అభిల్ షోరాన్, భొవ్నేష్ మెండిరత్త, రుద్రాంక్ష్ పాటిల్, స్నప్నిల్ కుశాలే, శ్రియాంక సదంగి, అనిశ్ భన్వాల, మను బాకర్, తిలోత్తమ సేన్, అర్జున్ బబుతా, వరుణ్ తోమర్.
నిరుడు చైనా ఆతిథ్యమిచ్చిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకంతో మెరిసిన తోమర్ జకర్తాలో జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లోనూ అదరగొట్టాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో తోమర్, అర్జున్ సింగ్ చీమా, ఉజ్వల్ మాలిక్ బృందం పసిడి పతకం కొల్లగొట్టింది. వరుణ్ (586), అర్జున్(579), ఉజ్వల్ (575)లు 1,740 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఇరాన్, కొరియా షూటర్లు వెండి, కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.