చండీగఢ్: జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు కొల్లగొట్టిన పంజాబ్ యువ షూటర్ కుశ్సీరత్ కౌర్ ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తన ప్రదర్శనపై మనస్థాపం చెందిన సీరత్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మరణించింది. ఫరీద్‌కోట్‌లోని తన నివాసంలో ఈ 17 ఏండ్ల యువ షూటర్ గురువారం ఉదయం తనువు చాలించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఆత్మహత్య గల కారణాలు ఏంటో తెలియవని, విచారణ జరుపుతున్నట్లు పోలీస్ అధికారి హర్జిందర్సింగ్ తెలిపాడు.