ఢిల్లీ: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్కప్ ఫైనల్- 2024లో భారత షూటర్ అఖిల్ శ్యోరనా కాంస్యం గెలిచాడు. ఢిల్లీలో జరుగుతున్న ఈ టోర్నీలో అఖిల్.. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో 452.6 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం సొంతం చేసుకున్నాడు. గతేడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అతడు.. తాజాగా కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.