ఢిల్లీ : భారత మోటార్‌స్పోర్ట్స్ దిగ్గజం హరిసింగ్ (59) సోమవారం కన్నుమూశారు. ‘జిప్సీ కింగ్’గా గుర్తింపు పొందిన ఆయన.. మాల్దీవుల్లో జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందారు.
భారత ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియా (రేమండ్ గ్రూప్ చైర్మన్), హరిసింగ్‌తో పాటు మరో ఐదుగురు కలిసి మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లగా.. అక్కడ స్పీడ్ బోట్లో ప్రయాణం చేస్తుండగా అది కాస్తా ప్రమాదానికి గురై ఈ ఘటన జరిగింది. గౌతమ్ సింఘానియా గాయాలతో బయటపడ్డా హరిసింగ్ మాత్రం ప్రాణాలు కోల్పోయారు.