Asian Relay Championships : భారత మిక్స్డ్ రీలే బృందం చరిత్ర సృష్టించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియన్ రీలే చాంపియన్‌షిప్స్(Asian Relay Championships)లో జాతీయ రికార్డు బద్దలు కొడుతూ పసిడి వెలుగులు విరజిమ్మింది. మహమ్మద్ అజ్మల్(Muhammed Ajmal), జ్యోతికా శ్రీ దండి, అమొల్ జాకబ్, సుబా వెంకటేశన్‌లతో కూడిన బృందం సోమవారం జరిగిన ఫైనల్లో అదరగొట్టింది.
స్వర్ణం పతకమే లక్ష్యంగా పెట్టుకున్న రీలే సభ్యులు 4×400 మీటర్ల పరుగును 3:14.12 నిమిషాల్లోనే పూర్తి చేసి విజేతగా నిలిచింది. నిరుడు ఆసియా గేమ్స్‌లో 3:14.34 నిమిషాలతో నెలకొల్పిన రికార్డును అజ్మల్ బృందం బ్రేక్ చేసింది. అయితే.. భారత జట్టుకు ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు మాత్రం దక్కలేదు.
NATIONAL RECORD
Indian mixed 4x400m relay team won gold with a time of 3:14.12 to better previous record of 3:14.34, at Asian Relay in Bangkok today.@Paris2024 #Olympics @Media_SAI @RECLindia pic.twitter.com/rpSxQraIfQ— Athletics Federation of India (@afiindia) May 20, 2024
ఒకవేళ భారత మిక్సడ్ రీలే బృందం 3:11.98 నిమిషాల్లో లక్ష్యాన్ని దాటి ఉంటే విశ్వక్రీడలకు అర్హత సాధించేది. ఇప్పటికే పురుషుల, మహిళల రీలే జట్లు ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాయి. ప్యారిస్ వేదికగా జూన్ 26 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 30 వరకు ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు ముగియనున్నాయి. ఆగస్ట్ 11న ముగింపు వేడుకలతో విశ్వ క్రీడలకు తెరపడనుంది.