న్యూఢిల్లీ: ఏషియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0-3 తేడాతో చైనీస్ తైపీ చేతిలో ఓటమిపాలైంది. ఆఖరి ఆసక్తికరంగా సాగిన పోరులో దిగ్గజ టీటీ ప్లేయర్ కమల్ 7-11, 10-12, 9-11తో వరల్డ్ నంబర్7 లిన్ యున్ జుపై ఓటమి చవిచూశాడు.
ఆ తర్వాత జరిగిన గేమ్‌లో మానవ్ థక్కర్ 9-11, 11-8, 3-11, 11-13తో కావో చెంగ్ జుయిపై ఓడాడు. మూడో రౌండ్లో హర్మీత్దేశాయ్ 6-11, 9-11, 7-11తో హువాం గ్ యన్ చెంగ్‌పై పరాజయంతో చైనీస్ తైపీ విజయం ఖరారైంది. ప్రతిష్ఠాత్మక టోర్నీ లో భారత పురుషుల, మహిళల జట్ల ప్రదర్శన పట్ల జాతీయ టీటీ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.