Hockey Asia Cup : హాకీ ఆసియా కప్‌లో భారత జట్టు (Team India) ఛాంపియన్‌గా నిలిచింది . ఆరంభం నుంచి అదరగొట్టిన టీమిండియా ఫైనల్లో ఫైనల్లో దక్షిణకొరియా (South Korea) చిత్తుగా ఓడించింది. అద్బుత విక్టరీతో నాలుగో ఆసియా కప్ టైటిల్‌ను దక్కించుకుంది. తద్వారా ఎనిమిదేళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో విజేతగా నిలచింది భారత్. అంతేకాదు ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ ( FIH Hockey World Cup) బెర్తును కైవసం చేసుకుంది హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం.
🏆🇮🇳 ASIA CUP CHAMPIONS.
India beats South Korea 4-1 and after 8 long years, India lifts the Asia Cup trophy.
With this victory, India booked its spot for the 2026 World Cup.
Heroes of the final: Dilpreet, Sukhjeet, Amit Rohidas & Captain Harmanpreet.#AsiaCup #Hockey… pic.twitter.com/SfuxVCV391
— RevSportz Global (@RevSportzGlobal) September 7, 2025
బిహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు ఓ రేంజ్లో విరుచుకుపడింది. లీగ్ దశ నుంచి తిరుగులేని ఆధిపత్యంతో టైటిల్ కొల్లగొట్టింది. సూపర్ 4లో చైనాపై 7-0తో గెలుపొందిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఫైనల్లో దక్షిణ కొరియాకు చుక్కలు చూపించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి 4-1తో కొరియాను మట్టికరిపించింది. ఇంతకుముందు 2003, 2007, 2017లో ఆసియా కప్‌ను తన్నుకుపోయింది టీమిండియా.
🥇 CHAMPIONS OF ASIA 🥇
🏑 MEN’S HOCKEY TEAM QUALIFIES FOR 2026 FIH WORLD CUP 🌎
Indian Men’s Hockey Team defeated South Korea🇰🇷 𝟒-𝟏 to win the Men’s Asia Cup for 𝐅𝐎𝐔𝐑𝐓𝐇 time.
Skill, speed & spirit 💪 — Host India played good hockey to clinch the Asian title & qualify… pic.twitter.com/v3cSnIRJ7u
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) September 7, 2025
తొలి అర్ధ భాగంలో గోల్ ప్రయత్నాలను అడ్డుకున్నారు. అయితే.. రెండో అర్ద భాగంలో సుఖ్జీత్ సింగ్ తొలి గోల్ అందించాడు. అనంతరం దిల్‌ప్రీత్ సింగ్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. అతడే కాసేపటికే మరో గోల్‌తో భారత్ విజయం ఖాయమైంది. అనంతరం పెనాల్టీ కార్నర్‌ను అమిత్ రోహిదాస్ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత లభించిన పీసీని కొరియా సద్వినియోగం చేసుకొని ఖాతా తెరిచింది. అప్పటికే భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. చివరి వరకూ మరో గోల్ చేసేందుకు పోరాడారు. కానీ, భారత డిఫెండర్లు వాళ్ల ఎత్తుల్ని చిత్తు చేశారు.