ఢిల్లీ : భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి వందన కటారియా తన 15 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. దేశం తరఫున 320 మ్యాచ్‌లలో 158 గోల్స్ చేసిన వందన.. భారత మహిళా హాకీ జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా గుర్తింపు దక్కించుకుంది. 2009లో సీనియర్ జట్టులోకి వచ్చిన వందన.. 15 ఏండ్ల కెరీర్లో భారత్ సాధించిన చరిత్రాత్మక విజయాల్లో కీలకపాత్ర పోషించింది. టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో ఆమె సభ్యురాలు. ఆ మెగా టోర్నీలో వందన హ్యాట్రిక్ గోల్స్ చేసి భారత్ తరఫున ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. ఆటకు వందన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెకు 2021లో అర్జున, 2022లో పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.