న్యూఢిల్లీ: దక్షిణకొరియా వేదికగా జరుగుతున్న ఏషియన్ అర్టిస్టిక్ జిమ్నాస్టిక్ చాంపియన్‌షిప్‌లో భారత యువ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ కాంస్య పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల వాల్ట్ ఫైనల్లో ప్రణతి 13.466 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది.
ఇదే విభాగంలో యిహాన్ జాంగ్ (13.650, చైనా), తీ క్విన్హ్ న్యుజెన్ (13.583, థాయ్‌లాండ్) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. భారత్‌కే చెందిన ప్రొతిస్థా సమంత(13.016) నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయింది. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఏషియన్ టోర్నీలో మూడో పతకం సొంతం చేసుకున్న ప్రణతి..వెటరన్ జిమ్నాస్ట్ దీపాకర్మాకర్(2)ను అధిగమించింది.