వార్సా: సూపర్‌బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు నిరాశపరుస్తున్నారు. ర్యాపిడ్ రౌండ్లలో తేలిపోయిన మన కుర్రాళ్లు బ్లిట్జ్‌లోనూ తడబడుతున్నారు. శనివారం కూడా నిరాశపరిచారు. 9 రౌండ్లు ముగిసిన బ్లిట్జ్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఐదు విజయాలు, రెండు డ్రా, రెండు ఓటములతో ఫర్వాలేదనిపించాడు.
కానీ గుకేశ్ ఐదు గేమ్‌లలో ఓడి మూడు గెలిచి ఒకటి డ్రా చేసుకున్నాడు. ప్రజ్ఞానంద నాలుగింటిలో గెలిచి ఒక గేమ్‌ను డ్రా చేసుకుని నాలుగు ఓడిపోయాడు. రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద.. మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించాడు.