పంజిమ్: చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. మెక్సికో ఆటగాడు జోస్ ఎడ్వర్డ్స్‌తో ముగిసిన ఐదో రౌండ్లో రెండు గేమ్‌లనూ డ్రా చేసుకున్న అతడు ఆదివారం జరిగిన టైబ్రేకర్‌లో ఓడిపోయాడు.
కీలకపోరులో హరికృష్ణ.. 2.5-3.5తో ఎడ్వర్డ్స్ చేతిలో పరాభవం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక ఈ టోర్నీలో భారత ఆశలన్నీ అర్జున్ ఇరిగేసి మీదే ఉన్నాయి.