పంజిమ్ : ఫిడే చెస్ ప్రపంచకప్ క్వార్టర్స్‌లో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి వరుసగా రెండో గేమ్నూ డ్రా చేసుకున్నాడు. చైనా ఆటగాడు వీయ్ యీతో తొలి గేమ్‌ను నల్లపావులతో ఆడిన అతడు.. రెండో గేమ్‌ను తెల్ల పావులతో ఆడినా డ్రాతోనే ముగించాడు.
ఈ ఇద్దరి మధ్య క్వార్టర్స్ ఫలితం నేడు జరుగబోయే టైబ్రేకర్‌లో తేలనుంది. మిగిలిన కార్టర్స్‌లో ఉజ్బెకిస్థాన్ గ్రాండ్ మాస్టర్ నాదిర్బెక్.. వరుసగా రెండో గేమ్నూ గెలుచుకుని సెమీస్‌కు దూసుకెళ్లగా మరో రెండు గేమ్స్ డ్రాగానే ముగిశాయి.