అస్తానా: కజకిస్థాన్ వేదికగా జరిగిన ఐటీఎఫ్ ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నీలో భారత ద్వయం సాయికార్తీక్రెడ్డి, సిద్దార్థ్ బంటియా జోడీ టైటిల్‌తో మెరిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌లో కార్తీక్, సిద్దార్థ్ ద్వయం 7-5, 6-7(13-15), 10-4 తేడాతో గ్లిన్క డానిల్, కర్ల్కిర్ సర్ జంటపై అద్భుత విజయం సాధించింది. మూడు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కార్తీక్, సిద్దార్థ్ అద్బుత పోరాట పటిమ కనబరిచారు.