Rupinder Pal Singh : రిటైర్మెంట్ ప్రకటించిన డ్రాగ్ ఫ్లికర్
Rupinder Pal Singh : భారత హాకీ సీనియర్ సభ్యుడు, డ్రాగ్ ఫ్లికర్‌గా పేరుగాంచిన రూపిందర్ పాల్ సింగ్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో...

న్యూఢిల్లీ : (Rupinder Pal Singh) భారత హాకీ సీనియర్ సభ్యుడు, డ్రాగ్ ఫ్లికర్‌గా పేరుగాంచిన రూపిందర్ పాల్ సింగ్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో వీరోచితంగా పోరాడి భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. బుధవారం ఉదయం తన రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన అభిమానులు నిరాశకు గురయ్యారు.
‘అందరికీ నమస్కారం. మీ అందరితో ఒక ముఖ్యమైన ప్రకటనను పంచుకోవాలనుకుంటున్నాను’ అని రూపిందర్ పాల్ సింగ్ ట్విట్టర్లో తన రిటైర్మెంట్ ప్రకటన రాశారు. ‘భారత హాకీ జట్టు నుంచి రిటైర్ అవ్వాలనే నా నిర్ణయం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. గత రెండు నెలలు నిస్సందేహంగా నా జీవితంలో అత్యుత్తమ రోజులు అని చెప్తాను. టోక్యోలో వేదికపై నిలబడి సహచర క్రీడాకారులతో కలిసి ఎన్నో అనుభూతులను పంచుకున్నాను. నా జీవితంలో అత్యంత నమ్మశక్యం కాని అనుభూతులు అవి. గత 13 సంవత్సరాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్పగా భావిస్తున్నాను. ప్రతిభావంతులైన క్రీడాకారులకు మార్గదర్శనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 223 మ్యాచుల్లో ఇండియా జెర్సీ ధరించే గౌరవం దక్కడం అనిర్వచనీయం. ఈ గొప్ప క్రీడను ఇష్టపడే దేశం కోసం ఆడే అవకాశం నాకు దక్కింది’ అని రూపిందర్ తన అనుభూతులను పంచుకున్నారు.
‘భారతదేశానికి ఒలింపిక్ పతకం సాధించాలనే గొప్ప కలను సాకారం చేసిన జట్టులో సభ్యుడిగా ఉండి రిటైర్మెంట్ తీసుకుంటున్నందుకు సంతోషంగా, సంతృప్తిగా అనుభూతి చెందుతున్నాను. ప్రపంచ హాకీలోని అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లతో ఆడిన జ్ఞాపకాలను నాతో తీసుకెళ్తున్నాను. హాకీలో భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాను’ అని రూపిందర్ పాల్ సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా తనకు ఎంతో ప్రోత్సాహమిచ్చిన కుటుంబసభ్యులకు, హాకీ ఇండియాకు, కోచ్‌లకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా తరఫున 223 మ్యాచులు ఆడిన రూపిందర్.. 119 గోల్స్ సాధించారు. 2010 లో సుల్తాన్ అజ్లాన్ షా కప్ పోటీల ద్వారా ఆరంగేట్రం చేసిన రూపిందర్ పాల్ సింగ్.. ఫుల్ బ్యాక్‌లో ఆడుతూ భారత డ్రాగ్ ఫ్లికర్‌గా పేరుగడించారు.
ఇవి కూడా చదవండి..
సరిహద్దు దాటి వచ్చి వంతెన కూల్చిన చైనా సైన్యం.. ఎక్కడంటే?
పట్టణ ప్రజల్లో తలనొప్పికి ఇదే కారణం..! బేయర్స్ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు
గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

