న్యూఢిల్లీ: చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం భారత బాక్సింగ్ జట్టు సోమవారం బయల్దేరి వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతున్న ఆసియా క్రీడలకు సన్నాహకంగా వుషియాన్లో 17 రోజుల పాటు భారత బాక్సర్లు సన్నాహక శిబిరంలో పాల్గొననున్నారు. మెగాటోర్నీకి ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఈ ఏర్పాట్లు చేసింది. సన్నాహక శిబిరం ముగిసిన వెంటనే మన బాక్సర్లు ఆసియాడ్‌లో పోటీపడనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జరీన్.. అరంగేట్రం ఆసియాగేమ్స్‌లో పసిడి పతకం సాధించాలన్న పట్టుదలతో ఉంది.
జట్టు వివరాలు: నిఖత్జరీన్(50కి), ప్రీతి (54కి), పర్వీన్ (57కి), జాస్మిన్ (60కి), అరుంధతి చౌదరి (66కి), లవ్లీనా బొర్గోహై (75కి). దీపక్ (51కి), సచిన్ (57కి), శివ తాపా (63.5కి), నిశాంత్‌దేవ్ (71కి), లక్ష్య చాహర్ (80కి), సంజిత్ (92కి), నరేందర్ (92+కి)