ఢాకా : ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆర్చర్లు జోరు కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, దీప్షిక ద్వయం ఫైనల్ చేరి పతకాన్ని ఖాయం చేయగా రికర్వ్ ఆర్చర్లూ కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ సెమీస్‌లో రెండో సీడ్ అభిషేక్, దీప్షిక.. 156-153తో కజకిస్థాన్‌ను ఓడించారు.
వీరి విజయంతో ఈ టోర్నీలో భారత్ ఐదు పతకాలను గెలుచుకోవడం ఖాయమైంది. రికర్వ్ విభాగంలో యశ్దీప్, అన్షిక జోడీతో కూడిన భారత్.. 0-6తో చైనీస్ తైపీ చేతిలో ఓటమిపాలై కాంస్య పోరుకు పరిమితమైంది. ఈ జోడీ కాంస్యం గెలిస్తే భారత పతకాల సంఖ్య మరింత పెరుగనుంది.