కోల్‌కతా : రష్యాతో రెండు స్నేహపూర్వక మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు ఓటమితో ఆరంభించింది. గురువారం జరిగిన తొలి పోరులో 27వ ర్యాంకర్ రష్యా 4-0తో భారత్‌ను ఓడించింది.
ఫస్టాఫ్‌లో ప్రత్యర్థిని బాగానే నిలువరించిన మన అమ్మాయిలు.. సెకండాఫ్‌లో మాత్రం పట్టు విడిచారు. రష్యా తరఫున పెతుఖోవా రెండు గోల్స్ కొట్టింది. 11న ఇరు జట్లు రెండో మ్యాచ్ ఆడతాయి.