మనామా: అంతర్జాతీయ స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బహ్రెయిన్‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు.. నేడు ర్యాంకింగ్స్‌లో తమకన్నా మెరుగ్గా ఉన్న చైనీస్ తైపీతో తలపడనుంది. గత మ్యాచ్‌లో ప్యారీ డబుల్ గోల్స్‌తో చెలరేగడంతో పాటు మిగిలినవాళ్లు రాణించడంతో భారత్ సత్తాచాటింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కనబర్చి మన అమ్మాయిలు మరో విజయాన్ని నమోదు చేయాలని చూస్తుంటే.. తైపీ జట్టు భారత్‌ను ఓడించాలని పట్టుదలతో ఉంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు ఫిఫా ర్యాంకింగ్స్‌లో 57వ స్థానంలో ఉండగా.. చైనీస్ తైపీ 40వ ప్లేస్‌లో కొనసాగుతున్నది. తెలంగాణ స్ట్రయికర్ గుగులోతు సౌమ్యకు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.