WTT | బుసాన్(కొరియా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన జరిగిన తొలి పోరులో భారత పురుషుల టీమ్ 3-0తో చిలీపై విజయం సాధించింది. దిగ్గజ ప్యాడ్లర్ శరత్ కమల్ 11-5, 11-8, 11-6తో నికోలస్ బుర్గోస్పై గెలిచాడు. హర్మీత్దేశాయ్ 11-8, 11-7, 11-6తో గుస్తావో గోమెజ్పై గెలిచాడు.