రాజ్‌గిర్ (బీహార్): హాకీ ఆసియా కప్‌లో హ్యాట్రిక్ విజయాలతో పూల్ ‘ఏ’ నుంచి టాపర్‌గా సూపర్-4కు అర్హత సాధించిన భారత జట్టు.. బుధవారం కీలక మ్యాచ్ ఆడనుంది. సూపర్-4 దశలో భారత్.. టోర్నమెంట్లో ఐదుసార్లు టైటిల్ గెలిచి అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న కొరియాతో తలపడనుంది. గ్రూప్ దశలో చైనా, జపాన్, కజకిస్థాన్‌తో విజయాలు భారత్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపి జట్టు ఫుల్ జోష్‌తో ఉంది.
కానీ కొరియా మాత్రం గ్రూప్ దశలో మలేషియా చేతిలో ఓడి పూల్ ‘బీ’ నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. మధ్యాహ్నం మ్యాచ్‌ల కారణంగా వేడి, ఉష్ణోగ్రతలకు కొరియా జట్టు ఒకింత ఇబ్బందులకు లోనై తడబాటుకు గురైంది. కానీ సాయంత్రం జరుగనున్న నేపథ్యంలో ఆ జట్టు భారత్‌కు దీటైన పోటీనిచ్చే అవకాశముంది.