భారత్ మరో సిరీస్‌పై గురిపెట్టింది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా సొంతగడ్డపై సత్తాచాటుతున్న టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంకతో వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది. గువాహటి వన్డే విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్‌సేన రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. క్రికెట్ మక్కాగా భావించే ఈడెన్‌గార్డెన్స్‌లో గురువారం భారత్, లంక జట్ల మధ్య రెండో వన్డే పోరు జరుగనుంది. గెలిచి టీమ్ఇండియా దక్కించుకుంటుందా, లేక లంక పుంజుకుని పోటీలోకి వస్తుందో చూడాలి.
కోల్‌కతా: స్వదేశం వేదికగా ఈ ఏడాది ఆఖర్లో జరిగే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. సుదీర్ఘ విరామం తర్వాత ఎలాగైనా మెగాటోర్నీని ముద్దాడాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా ఆ దిశగా అడుగులు వేస్తున్నది. టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్లు రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ తిరిగి జట్టులోకి రావడంతో జట్టు నిండుదనం సంతరించుకున్నది. ఇన్నాళ్లు ఒక రకంగా ఫామ్‌లేమితో ఇబ్బందులు ఎదుర్కొన్న కోహ్లీ..గువాహటి వన్డేలో లంకపై సెంచరీతో కదంతొక్కాడు.
లంక బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించాడు. కోహ్లీకి తోడు రోహిత్, గిల్ రాణించడంతో టీమ్ఇండియా భారీ విజయం ఖాతాలో వేసుకుంది. బంగ్లాపై డబుల్ సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్‌ను కాదని జట్టులోకి తీసుకున్న గిల్..కెప్టెన్ నమ్మకాన్ని చూరగొంటూ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. మరోవైపు చేతి గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. బౌలింగ్ విషయానికొస్తే..హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్ ఆదిలోనే లంకను దెబ్బకొడితే..మిగతా పనిని ఉమ్రాన్ మాలిక్, షమీ పూర్తి చేశారు. మొత్తంగా సమిష్టి ప్రదర్శనతో తొలి వన్డేను కైవసం చేసుకున్న రోహిత్‌సేన.. కోల్‌కతాలోనూ అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నది.
లంక పుంజుకోవాలని:
భారీ లక్ష్యఛేదనలో అద్భుత పోరాటపటిమ కనబరిచిన లంక రెండో వన్డేలో పుంజుకోవాలని చూస్తున్నది. 2014 తర్వాత ఈడెన్‌గార్డెన్స్‌లో భారత్‌తో వన్డే మ్యాచ్ ఆడుతున్న లంక సిరీస్‌ను సమం చేసేందుకు పట్టుదలతోఉంది.
జట్ల అంచనా
భారత్: రోహిత్‌శర్మ(కెప్టెన్), గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్, హార్దిక్, అక్షర్‌పటేల్, షమీ, మాలిక్, సిరాజ్, చాహల్
శ్రీలంక: షనక(కెప్టెన్), నిస్సనక, ఫెర్నాండో, కుశాల్ మెండిస్, చరిత అసలంక, ధనంజయ డిసిల్వా, హసరంగ, దునిత్ వెల్లగలె, కరుణరత్నె, కసున్ రజిత, మదుషనక/లహిరు కుమార.
67 వన్డేల్లో లంక మాజీ కెప్టెన్ జయవర్దనే (12,650)ను అధిగమించడానికి కోహ్లీ(12, 584)కి కావాల్సిన పరుగులు