కాన్బెరా: ఆస్ట్రేలియా ప్రైమ్‌మినిస్టర్స్ లెవన్‌తో జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్( PM’s XI v India)కు వర్షం అడ్డుపడింది. రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఇవాళ కాన్బెరాలోని మనూకా ఓవల్‌లో ప్రారంభం కావాల్సి ఉన్నది. కానీ ఎడతెరపిలేకుండా వర్షం పడుతున్న కారణంగా.. తొలి రోజు ఆటను రద్దు చేశారు. దీంతో భారత క్రికెటర్లకు.. పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ మిస్సయ్యే అవకాశాలు ఉన్నాయి. అడిలైడ్‌లో ప్రారంభం అయ్యే రెండో టెస్టుకు ముందు పింక్ బాల్ మ్యాచ్‌తో భారత్ సంసిద్దం కావాలనుకున్నది. అయితే ఆదివారం 50 ఓవర్ల మ్యాచ్ ఆడేందుకు రెండు జట్లు అంగీకరించాయి. ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే, రేపు ఆ మ్యాచ్ జరుగుతుంది.
Update: PM’s XI v India – Manuka Oval
Play has been abandoned for Day 1 and will resume tomorrow (Sunday) at 9:10 am IST. Coin toss will be at 8:40 am IST.
Teams have agreed to play 50 overs per side.#TeamIndia pic.twitter.com/qb56K8dtX0
— BCCI (@BCCI) November 30, 2024