రూర్కెలా: సొంతగడ్డపై స్థాయికి తగ్గ ప్రదర్శనతో దుమ్మురేపి హాకీ ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన భారత పురుషుల జట్టు.. ఆదివారం ఇంగ్లండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఆరంభ పోరులో 2-0తో స్పెయిన్‌ను మట్టికరిపించిన టీమ్ఇండియా అదే జోరు కొనసాగించాలని చూస్తుంటే.. తమ తొలి మ్యాచ్‌లో 5-0తో వేల్స్‌పై నెగ్గిన ఇంగ్లండ్ సమరోత్సాహంతో ఉంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రొహిదాస్, మన్‌ప్రీత్, మన్దీప్ సింగ్ సమిష్టిగా సత్తాచాటితే భారత్‌కు తిరుగుండదు.