INDA vs USA | జగదీశన్ మెరుపు శతకం.. వామప్ మ్యాచ్‌లో యూఎస్ఏకు షాకిచ్చిన భారత కుర్రాళ్లు..!
INDA vs USA : పొట్టి ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లో సంచలనం. తొమ్మిదో సీజన్లో పెద్ద జట్లకు షాకిచ్చిన యూఎస్ఏను భారత ఏ జట్టు అలవోకగా మట్టికరిపించింది.
INDA vs USA : పొట్టి ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లో సంచలనం. తొమ్మిదో సీజన్లో పెద్ద జట్లకు షాకిచ్చిన యూఎస్ఏను భారత ఏ జట్టు అలవోకగా మట్టికరిపించింది. డీవై పాటిల్ మైదానంలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి.. 38 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఓపెనర్ నారాయన్ జగదీశన్(104) శతకమోతకు, కెప్టెన్ ఆయుష్ బదొని(60 నాటౌట్) అర్ధ శతకం తోడవ్వగా భారీ లక్ష్యాన్నినిర్దేశించిన భారత్.. తర్వాత ప్రత్యర్ధిని రెండొందలకే కట్టడి చేసింది.
గత సీజన్లో సొంతగడ్డపై చెలరేగిపోయిన యూఎస్ఏకు వామప్ మ్యాచ్‌లోనే ఊహించని ఝలక్ ఇచ్చింది భారత ఏ జట్టు. భారీ అంచనాలతో వరల్డ్‌కప్ బరిలో నిలిచిన అమెరికాను పునరాలోచనలో పడేస్తూ.. 38 పరుగుల తేడాతో ఓడించింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత ఏ జట్టు భారీ స్కోర్‌తో యూఎస్ఏకు సవాల్ విసిరింది. 239 రన్స్ ఛేదనలో ఓపెనర్ ఆండ్రీస్ గౌస్(44) రాణించినా మిగతావాళ్లు చేతులెత్తేశారు. మిస్టరీ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్(3-37) స్పిన్ ధాటికి టాపార్డర్ కుప్పకూలగా.. సీనియర్ పేసర్ ఖలీల్ అహ్మద్(2-25) మిడిలార్డర్‌ను కూల్చాడు. దాంతో.. అమెరికా జట్టు 200లకే ఆలౌటయ్యింది.
🇺🇸 USA lose by 38 runs against India A 🏏
Still a decent chase from the USA, though it’s worth keeping in mind that India A some used part-time bowlers.#CricketEverywhere #USACricket #ICC pic.twitter.com/ZrElcCDwCE
— Associate Chronicles (@AssociateChrons) February 2, 2026
జగదీశన్ శతకగర్జన..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత ఏ జట్టుకు శుభారంభం దక్కలేదు. డేంజరస్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(28) విఫలమైనా.. మరో ఓపెనర్ నారాయన్ జగదీశన్(104 : 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అమెరికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అంతర్జాతీయ అనుభవమున్న బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అతడు.. 49 బంతుల్లోనే సెంచరీతో మెరిశాడు. తిలక్ వర్మ(38) రాణించగా.. ఆయుష్ బదొని(60 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. జగదీశన్‌తో కలిసి అర్ధ శతకం భాగస్వామ్యంతో జట్టు స్కోర్ 230 దాటించాడు. వీరిద్దరి మెరుపులతో ప్రత్యర్థికి 239 పరుగుల కష్టమైన లక్ష్యాన్ని ఇండియా ఏ నిర్దేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

