FIH Nations Cup : ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్‌లో భారత మహిళల హాకీ జట్టు అజేయంగా దూసుకెళుతోంది. ఆక్లాండ్ వేదికగా మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్‌పై కాస్త కష్టపడి గెలిచిన టీమిండియా సెమీఫైనల్ చేరుకుంది. తద్వారా సలీమా టెటె సారథ్యంలోని భారత్ గ్రూప్ ఏ నుంచి సెమీస్ బెర్తు దక్కించుకుంది.
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్‌లో భారత జట్టు గొప్పగా ఆడుతోంది. జపాన్ రూపంలో క్వార్టర్ ఫైనల్లో కఠినమైన ప్రత్యర్థికి ఎదురైనప్పటికీ 2-1తో టీమిండియా గెలుపొందింది. కెప్టెన్ సలీమా టీటె, ఫార్వార్డ్ లల్ర్మెసియామి చెరొక గోల్ చేయడంతో జపాన్‌కు ఓటమి తప్పలేదు.
𝐓𝐇𝐄 𝐆𝐎𝐀𝐋 𝐓𝐇𝐀𝐓 𝐒𝐄𝐍𝐓 𝐈𝐍𝐃𝐈𝐀 𝐓𝐎 𝐓𝐇𝐄 𝐒𝐄𝐌𝐈-𝐅𝐈𝐍𝐀𝐋𝐒. 🇮🇳🔥
Lalremsiami struck in the 49th minute to restore India’s lead against Japan and help secure a place in the last four of the FIH Hockey Women’s Nations Cup 2026 in Auckland, New Zealand. 🇳🇿🏑
— Hockey India (@TheHockeyIndia) June 16, 2026
మూడో అర్ధ భాగంలో 33వ నిమిషంలో సలీమ, 49వ నిమిషంలో లల్రెస్మియామి గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 2-1కు చేరింది. తద్వారా ఆరు పాయింట్లో గ్రూప్ ఏ నుంచి అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా సెమీస్ బెర్తు పట్టేసింది. అంతేకాదు వచ్చే ఏడాది జరుగబోయే ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌కు టీమిండియా అర్హత సాధించింది.