Richa Ghosh : వరల్డ్ ఛాంపియన్ రీచా ఘోష్ (Richa Ghosh)కు ఇచ్చిన మాటను బెంగాల్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. విశ్వ విజేతగా తిరిగొచ్చిన రీచాకు డీఎస్పీ (DSP) హోదాను కట్టబెట్టింది. యావత్ దేశం, రాష్ట్రం గర్వించేలా చేసిన టీమిండియా స్టార్‌ను సిలిగురి ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా)గా నియమించారు. బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్(DGP Rajeev Kumar) సమక్షంలో గురువారం రీచా బాధ్యతలు స్వీకరించింది. పోలీస్ యూనిఫామ్‌లో కొత్త ఇన్నింగ్స్ ఆరంభించనున్న రీచాకు అభినందనలు వెల్లువెత్తున్నాయి.
ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో కీలకమైన రీచాకు స్వరాష్ట్రం బెంగాల్లో ఘన స్వాగతంతో పాటు ఊహించని పదవి దక్కింది. నవంబర్ 8 శనివారం జరిగిన సన్మాన కార్యక్రమంలో వికెట్ కీపర్, బ్యాటర్‌ను డీఎస్పీగా నియమించింది బెంగాల్ ప్రభుత్వం. విశ్వ విజేతగా దేశం, రాష్ట్రం ఖ్యాతిని ఇనుమడింపజేసిన రీచా సన్మాన వేడుకలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.
Indian women’s cricket team wicketkeeper Richa Ghosh has become the DSP of the West Bengal Police.
She assumed the position of ACP in Siliguri. #RichaGhosh pic.twitter.com/3MxJ5QxFyG— Indian Cricket Team (@TeamIndia_in) December 4, 2025
ఫినిషర్‌గా సమర్ధమైన పోషించిన ఆమెకు రూ.34 లక్షల చెక్కును ప్రదానం చేశారు. క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ పేసర్ ఝులాన్ గోస్వామి, ముఖ్యమంత్రి మమత చేతుల మీదుగా రీచా చెక్కును అందుకున్నారు. రాష్ట్రంలో మహిళా క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచినందుకు రీచాకు బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బంగా బిబుసాన్’ అవార్డును ప్రకటించారు. అంతేకాదు కొత్తగా నిర్మించబోయే స్టేడియానికి రీచా ఘోష్ పేరు పెడుతామని సీఎం మమతా ప్రకటించారు.
ఐపీఎల్లో ఆర్సీబీ ఫినిషర్‌గా అదరగొట్టిన రీచా.. వరల్డ్‌కప్‌లోనూ అదే పాత్ర పోషించింది. ఓపెనర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధానలు ఇచ్చిన శుభారంభాన్ని చివరకు భారీ స్కోర్‌గా మలిచే బాధ్యత తీసుకుందీ వికెట్ కీపర్. అచ్చం ధోనీ స్టయిల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చిన రీచా.. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 133.52 స్ట్రయిక్ రేటుతో 235 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాపై ఊచకోతను తలపిస్తూ తను ఆడిన 94 పరుగుల ఇన్నింగ్స్ టోర్నీకే హైలెట్.
సెమీ ఫైనల్లోనూ ఆస్ట్రేలియాపై జెమీమా రోడ్రిగ్స్(127 నాటౌట్)తో కలిసి విలువైన రన్స్ చేసింది రీచా. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడిన తను16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 రన్స్ చేసింది. ఇక ఫైనల్లోనూ దంచేసిన తను 34 రన్స్‌తో టీమిండియా భారీ స్కోర్ చేయడంలో భాగమైంది.
Richa Ghosh joins State Police as DSP
Richa Ghosh, a crucial member of the Indian team that won the Women’s Cricket World Cup, joined the State Police today in the rank of DSP (Deputy Superintendent of Police). She has been appointed as ACP (Assistant Commissioner of Police) in… pic.twitter.com/x6lurmvRTI
— West Bengal Police (@WBPolice) December 3, 2025