ముంచిన పొగ మంచు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ విజేతను తేల్చే నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దయింది. బుధవారం లక్నోలోని ఏకనా స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లో టాస్ కూడా పడకుండానే అంపైర్లు ఆటను రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా లక్నో నగరంపై దట్టమైన పొగమంచు ఆవహించింది.
- భారత్, దక్షిణాఫ్రికా నాలుగో టీ20 రద్దు
లక్నో: భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ విజేతను తేల్చే నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దయింది. బుధవారం లక్నోలోని ఏకనా స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లో టాస్ కూడా పడకుండానే అంపైర్లు ఆటను రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా లక్నో నగరంపై దట్టమైన పొగమంచు ఆవహించింది.
మంచు ప్రభావంతో మైదానంలో కొద్ది దూరంలో ఉన్నవారు కూడా కనిపించలేకుండా మారింది. పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందేమోనని 5 సార్లు పర్యవేక్షణకు వచ్చిన అంపైర్లు.. చివరికి రాత్రి 9.30 గంటలకు ఆటను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత జట్టు 2-1 ఆధిక్యంతో ఉంది. సిరీస్‌లో చివరిదైన ఆఖరి టీ20 ఈనెల 19న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
గిల్‌కు గాయం.. సిరీస్‌కు దూరం!
భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోమారు గాయం బారిన పడ్డాడు. నాలుగో టీ20 ప్రాక్టీస్ సందర్భంగా గిల్ కాలి బొటనవేలికి గాయమైంది. దీంతో లక్నో మ్యాచ్‌తో పాటు అహ్మదాబాద్ టీ20కీ గిల్ అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

