Asia Cup | ముంబై: శ్రీలంక వేదికగా జరుగనున్న ఆసియాకప్ టోర్నీ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును శనివారం ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన టీమ్ఇండియాకు హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ నెల 19 నుంచి మొదలుకానున్న ఆసియాకప్‌లో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్నది.
రికార్డు స్థాయిలో ఏడుసార్లు ఆసియాకప్ గెలిచిన టీమ్ఇండియా..చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, యూఏఈ, నేపాల్‌తో కలిసి గ్రూపు-ఏలో పోటీపడనుంది. రణగిరి దం బు ల్లా స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టులో 15 మం దితో పాటు ట్రావెల్ రిజర్వ్‌గా శ్వేతా షెరావత్, సైకా ఇషాక్, తనూజ కన్వ ర్, మేఘనా సింగ్ ఎంపికయ్యారు.
ఆసియాకప్ భారత జట్టు: హర్మన్‌ప్రీత్(కెప్టెన్), మంధాన(వైస్ కెప్టెన్), షెఫాలీవర్మ, దీప్తి, జెమీమా, రీచాఘోష్, ఉమా చెత్రీ, పూజ వస్ర్తాకర్, అరుంధతిరెడ్డి, రేణుకాసింగ్, హేమలత, శోభన, రాధా , శ్రేయాంక, సంజన.