IND vs SA : సిరీస్‌లో కీలకమైన ఐదో టీ20లో భారత్ మొదట బ్యాటింగ్‌కు రెఢీ అవుతోంది. అహ్మదాబాద్‌లో బ్యాటింగ్ పిచ్‌పై దంచేసి.. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని టీమిండియా అనుకుంటోంది. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే ట్రోఫీ పట్టేస్తుంది. ప్రత్యర్ధి జట్టు ఒకవేళ ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ సేనకు షాకిస్తే సిరీస్ సమం అవుతుంది.
అహ్మదాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎడన్ మర్క్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్‌లో భారత్ రెండు కీలక మార్పులు చేసింది. అనారోగ్యంతో అక్షర్ పటేల్, గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో.. సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. సఫారీ టీమ్ సైతం ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది.
A look at #TeamIndia‘s Playing XI for the 5⃣th T20I 🙌
Updates ▶️ https://t.co/kw4LKLNSl3#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/oYOpdh32ne
— BCCI (@BCCI) December 19, 2025
భారత తుది జట్టు : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా తుది జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డెవిడ్ మిల్లర్, డొనొవాన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.