226 కొట్టేశారు..
న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా పంజా విసిరింది. తొలి టీ20లోనే తమ బ్యాట్ పవర్ చూపెడుతూ.. రికార్డు ఛేజింగ్‌తో ఔరా అనిపించింది. సంజూ శాంసన్ (33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 67), నమన్ ధీర్ (15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి పోరులో ఈ ఫార్మాట్లో తమ అత్యధిక పరుగుల లక్ష్య ఛేదనను నమోదు చేస్తూ.. 4 వికెట్లతో కివీస్‌పై ఘన విజయం సాధించింది.
- భారత్ రికార్డు ఛేజ్
- తొలి టీ20లో కివీస్‌పై విజయం
- శాంసన్, నమన్ మెరుపులు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా పంజా విసిరింది. తొలి టీ20లోనే తమ బ్యాట్ పవర్ చూపెడుతూ.. రికార్డు ఛేజింగ్‌తో ఔరా అనిపించింది. సంజూ శాంసన్ (33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 67), నమన్ ధీర్ (15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి పోరులో ఈ ఫార్మాట్లో తమ అత్యధిక పరుగుల లక్ష్య ఛేదనను నమోదు చేస్తూ.. 4 వికెట్లతో కివీస్‌పై ఘన విజయం సాధించింది.
కివీస్ ఇచ్చిన 226 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలుండగానే అందుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 42) కూడా ఆకట్టుకున్నాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 225/6 భారీ స్కోరు సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 నాటౌట్), ఫిన్ అలెన్ (24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) దంచికొట్టగా.. బెవాన్ జాకబ్స్ (31), డారిల్ మిచెల్ (28), సిఫర్ట్ (24) కూడా మెరిశారు. నాలుగేండ్ల్ల తర్వాత బరిలోకి దిగిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (0/49)తో పాటు బౌలర్లందరూ 40కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. అర్ష్‌దీప్ (1/45), మయాంక్ యాదవ్ (1/40), అక్షర్ పటేల్ (1/51) తలో వికెట్ తీశారు. శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండో టీ20 శనివారం ఇదే వేదికపై జరగనుంది.

శాంసన్ ఆరంభం .. నమన్ ముగింపు
భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు శాంసన్, అభిషేక్(29) అద్భుత ఆరంభాన్ని అందించారు. అభి తన తొలి బంతికే సిక్సర్ బాదగా, శాంసన్ భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫెర్గూసన్ వేసిన రెండో ఓవర్లో సంజూ 4, 6,4 కొడితే.. మిల్నేను అభి 4, 4, 6,6తో దంచాడు. బ్రేస్‌వెల్ వేసిన ఆరో ఓవర్లో 6,4 కొట్టి 23 బంతుల్లోనే శాంసన్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. తర్వాతి బాల్కే అభి మిల్నేకు క్యాచ్ ఇవ్వడంతో పవర్‌ప్లేను భారత్ 94/1తో ముగించింది.అయితే, ఫీల్డింగ్ విస్తరించిన తర్వాత కివీస్ స్పిన్నర్లు బ్రేస్‌వెల్, శాంట్నర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్‌ను దెబ్బతీశారు. తన వరుస ఓవర్లలో శాంసన్, ఇషాన్ (1)ను శాంట్నర్ వెనక్కుపంపితే.. స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడే బలహీనతను మరోసారి బయటపెట్టిన తిలక్ (11 బంతుల్లో 6)ను బ్రేస్‌వెల్ డగౌట్ చేర్చాడు.
ఓ దశలో 21 బంతుల్లో ఒక్క బౌండరీ రాకపోవడంతో 122/4తో టీమిండియా డీలా పడింది. ఈ క్లిష్ట సమయంలో అక్షర్ పటేల్ (24)తో కలిసి కెప్టెన్ శ్రేయస్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును రేసులో నిలిపారు. హెన్రీ వేసిన 14వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన అయ్యర్ టీమ్‌ను తిరిగి రేసులోకి తెచ్చాడు. తర్వాతి ఓవర్లోనే ఫెర్గూసన్.. అక్షర్‌ను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ కివీస్ చేతిలో వెళ్లేలా కనిపించింది.
అదే ఓవర్లో 27 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ నుంచి అయ్యర్ బయటపడ్డాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు నమన్ ధీర్ తీవ్ర ఒత్తిడిలో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. శాంట్నర్ బౌలింగ్‌లో 6,4.. నేథన్ స్మిత్ వేసిన 17వ ఓవరలో రెండు ఫోర్లతో జోరందుకున్నాడు. 24 పరుగుల వద్ద ఫెర్గూసన్ క్యాచ్ డ్రాప్ చేయడంతో లభించిన చాన్స్‌ను అతను రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. చివరి 12 బంతుల్లో 16 రన్స్ అవసరమైన సమయంలో 19వ ఓవర్ తొలి బంతికే అయ్యర్ ఔటైనా.. నమన్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో మ్యాచ్ ముగించాడు.
1 టీ20 ఫార్మాట్లో భారత్‌కు ఇదే అత్యధిక ఛేదన. 2023లో ఆస్ట్రేలియాపై వైజాగ్‌లో 209 రన్స్ టార్గెట్ ఛేజ్ చేసిన రికార్డు మెరుగైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

