న్యూఢిల్లీ: గత వారం మలేషియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. ఇండియా ఓపెన్‌లో బోణీ కొట్టారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బుధవారం సాత్విక్-చిరాగ్ జంట 21-15, 19-21, 21-16తో ఫాంగ్ చెహ్ లీ-ఫాంగ్ జెన్ లీ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించారు.
ప్రత్యర్థి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైనా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ జంట అద్వితీయ ప్రదర్శన కనబర్చింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ 22-24, 13-21తో లీ చెక్ యూ (హాంకాంగ్) చేతిలో ఓటమి పాలయ్యాడు.