INDW vs PAKW : మహిళల వరల్డ్ కప్‌లో అదిరే బోణీ కొట్టిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో త్వరగానే రెండు వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ బౌలర్లను దంచేస్తూ స్కోర్‌బోర్డును పరుగెత్తించిన స్మృతి మంధాన(23) పవర్ ప్లేలోనే వెనుదిరిగింది. పాక్ సారథి ఫాతిమా సనా బౌలింగ్‌లో మంధాన ఎల్బీగా డగౌట్ చేరింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (13 నాటౌట్) జతగా ఇన్నింగ్స్ నడిపించిన ప్రతీకా రావల్ (31)జట్టు స్కోర్ 60 దాటించింది.
అయితే.. జోరు పెంచే క్రమంలో సాదిక్ ఇక్బాల్ వేసిన16వ ఓవర్లో ఆమె బౌల్డ్ అయింది. దాంతో.. 67 వద్ద టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(4 నాటౌట్) ఆడుతున్నారు. 16 ఓవర్లకు స్కోర్.. 72-2. వీరిద్దరూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పితే.. ఆ తర్వాత మిడిలార్డర్‌పై చెలరేగి భారీ స్కోర్ అందించే అవకాశముంది.
End of Powerplay ✅#TeamIndia reach 54/1
Harleen Deol joins Pratika Rawal at the crease 🙌
Updates ▶ https://t.co/9BNvQl3J59#WomenInBlue | #CWC25 | @PratikaRawal64 pic.twitter.com/lDs1QwaX8F
— BCCI Women (@BCCIWomen) October 5, 2025